26న నాని 'మజ్ను' ఆడియో

Tuesday,August 23,2016 - 03:01 by Z_CLU

 

తన దైన న్యాచురల్ నటనతో వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న నాని కథానాయకుడిగా అను ఇమాన్యుల్ కథానాయికగా ‘ఉయ్యాల జంపాల’ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వం లో ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం ‘మజ్ను’. గోపి సుందర్ సంగీతం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని ‘కళ్ళు మూసి’ అనే పాటను విడుదల చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో ను ఈ నెల 26 న విడుదల చెయ్యనున్నారు చిత్ర యూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 17 న సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.