Jesrey - నేషనల్ అవార్డు సినిమాకు రెండేళ్ళు

Monday,April 19,2021 - 02:21 by Z_CLU

కొన్ని సినిమాలు రిలీలైన రోజు మూవీ లవర్స్ కి స్పెషల్ డే గా ఉంటాయి. ఈరోజు అలాంటి స్పెషల్ డే అని చెప్పొచ్చు.  మూవీ లవర్స్ తో పాటు క్రికెట్ లవర్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకొని క్లాసిక్ అనిపించుకున్న ‘జెర్సీ’ రిలీజై నేటికి రెండేళ్ళవుతోంది. మళ్ళీ రావా వంటి సెన్సిబుల్ లవ్ స్టోరీతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు గౌతం రెండో సినిమాకే జెర్సీ లాంటి బెస్ట్ ఫిలింతో వస్తాడని ఎవరూ ఊహించలేదు.

jersey 2 years zeecinemalu 1

కాకపోతే నాని అండ్ టీం మాత్రం షూటింగ్ స్టేజిలో గౌతం నుండి ఓ క్లాసిక్ సినిమా వస్తుందని నమ్మారు. అందుకే గౌతం కి టీం నుండి బెస్ట్ సపోర్ట్ లభించింది. గౌతం స్క్రిప్ట్ చెప్పినప్పటి నుండి రిలీజ్ వరకూ నిర్మాత నాగ వంశీ జెర్సీ సినిమాను బాగా నమ్మాడు. గౌతం కి ఏది కావాలో అది అందిస్తూ ప్రొడక్షన్ వాల్యూస్ తో కూడా జెర్సీ కి బెస్ట్ సపోర్ట్ అందించాడు.

ఇక నాని కెరీర్ లో బెస్ట్ ఫిలిం లిస్టు చూస్తే అందులో ఈ సినిమా మొదటి వరుసలో ఉంటుంది. నానిలోని మరో కోణాన్ని పరిచయం చేసిన సినిమా ఇది. అర్జున్ అనే క్రికెటర్ క్యారెక్టర్ కి నాని బెస్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించి తన పెర్ఫార్మెన్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. సినిమా రిలీజై రెండేళ్ళవుతున్నా సోషల్ మీడియాలో తమ హ్యాపీ నెస్ ఎక్స్ ప్రెస్ చేయాలంటే ప్రేక్షకులు ఇప్పటికీ జెర్సీ లోని నాని ట్రైన్ సీన్, మీమ్ వాడుకుంటున్నారు. ఆ సీన్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్.

జెర్సీ కి టెక్నీషియన్స్ నుండి కూడా బెస్ట్ వర్క్ అందింది. ముఖ్యంగా అనిరుద్ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. ఈ సినిమాకు గానూ ఎడిటర్ గా నేషనల్ అవార్డు అందుకున్న నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా… తన టాలెంట్ తో సినిమాను పర్ఫెక్ట్ గా కట్ చేసి మెప్పించాడు నవీన్. గౌతం రాసుకున్న కథని హీరో నానితో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరూ నమ్మి బెస్ట్ ఇచ్చారు కాబట్టే ఈ సినిమా నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళింది. మూవీ లవర్స్ తో పాటు క్రికెట్ లవర్స్ ని కూడా మెస్మరైజ్ చేసిన ఈ సినిమా ఎన్నేళ్ళయినా స్పెషల్ సినిమానే.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics