ఎమోషనల్ క్లాసికల్ హిట్ కు ఏడాది

Sunday,April 19,2020 - 05:33 by Z_CLU

జెర్సీ.. ఇది కేవలం ఓ సినిమా కాదు. ఇదొక ఎమోషనల్ జర్నీ.
సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇది. ప్రతి రివ్యూలో బాటమ్ లైన్ కూడా ఇదే. ట్రాజడీ ఎండింగ్ ను తెలుగు ఆడియన్స్ ఇష్టపడరనే రిమార్క్ ను జర్సీ సినిమా తప్పని రుజువుచేసింది. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తూ ఎమోషనల్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది.

అర్జున్ అలియాస్ బాబుగా నాని, కోచ్ పాత్రలో సత్యరాజ్, సారాగా భార్య పాత్రలో శ్రద్ధాశ్రీనాథ్, నానిగా చైల్డ్ ఆర్టిస్ట్ రోనిత్.. వీళ్లు నలుగురు ఈ సినిమాకు 4 మూలస్తంభాలు. సినిమాలో మనసును తాకే సన్నివేశాలు, కంటతడి పెట్టించే సీన్లకు కొదవలేదు. గౌతమ్ తిన్ననూరి కథ-డైరక్షన్ ఈ సినిమాకు ప్రాణంపోయగా.. అనిరుథ్ మ్యూజిక్ బ్యాక్ బోన్ గా నిలిచింది.

ఆరోగ్యం బాగాలేక క్రికెట్ ను వదిలేస్తే.. భార్యతో ఛీ అనిపించుకొని, లోకం దృష్టిలో పనికిరాని వాడిగా మిగిలినప్పటికీ.. కొడుకు మాత్రం తనను హీరోగా చూడాలనే ఆశ అర్జున్ ను జాతీయ స్థాయి క్రికెటర్ ను చేస్తుంది. నువ్వు క్రికెట్ ఆడితే బాగుంటుంది నాన్న హీరోలా ఉంటావ్ అంటూ కొడుకు చెప్పే సీన్ సినిమాకు హై-పాయింట్.

కొడుక్కి జర్సీ కూడా కొనివ్వలేని స్థితి నుంచి భార్య పర్సు లోంచి డబ్బులు కొట్టేసే స్థాయికి దిగజారే పాత్రలో నాని నటన అద్భుతం. క్రికెట్ ఆడితే ప్రాణం పోతుందని తెలిసి కూడా కొడుకు కోసం క్రికెట్ ఆడడం.. క్లైమాక్స్ లో తను చనిపోయినప్పటికీ కొడుక్కి జర్సీ ఇవ్వడం లాంటి సన్నివేశాలు చూసి ఏడుపు ఆపుకోవడం చాలా కష్టం.

సినిమా విడుదలై ఏడాదైనా ఇప్పటీకీ జెర్సీ పేరుచెబితే.. ఆ భావోద్వేగ సన్నివేశాలన్నీ అలా కళ్లముందు కదలాడుతాయి. ఈ సినిమాను మరోసారి చూడాలనుకుంటే.. కింద లింక్ ను క్లిక్ చేయండి

జెర్సీ ఫుల్ మూవీ