విక్రమ్ కెరీర్ లో ఫాస్టెస్ట్ సినిమా

Wednesday,September 11,2019 - 01:21 by Z_CLU

మన దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎవరి మేకింగ్ స్టైల్ వారిది. అయితే వీరిలో డైరెక్టర్ విక్రం మేకింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్. ప్రీ ప్రొడక్షన్ కి ఎంత టైం తీసుకుంటాడో మేకింగ్ కి కూడా అంతే టైం తీసుకుంటాడు. పైగా కొంచెం టైం తీసుకొని ఎక్కడో చోట హాలీవుడ్ మేకింగ్ ను కూడా గుర్తుచేస్తుంటాడు. అయితే ఈసారి అలా జరగలేదు. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసి అనుకున్న టైంకి అవుట్ పుట్ ఇచ్చేసాడు క్రియేటీవ్ డైరెక్టర్.

ఇదే విషయాన్ని నాని కూడా చెప్పుకొచ్చాడు. లేటెస్ట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ‘గ్యాంగ్ లీడర్’ విక్రమ్ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ సినిమా అన్నాడు. తన కాలికి కాస్త గాయం అవ్వడం వల్ల షూట్ కి కొంచెం బ్రేక్ వచ్చిందని లేదంటే ఇంకా స్పీడ్ గా అయిపోయేదని తెలిపాడు. ఇకపై కూడా ఇదే స్పీడ్ లో విక్రం సినిమాలు చేయాలని కోరుకుంటున్నా అన్నాడు. సో మరి నాని చెప్పినట్టే ఇకపై విక్రం ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తాడా..చూడాలి.