"అ!" మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన నాని

Monday,January 29,2018 - 06:44 by Z_CLU

నిర్మాతగా మారి నాని నిర్మించిన సినిమా “అ!”. ఫస్ట్ లుక్స్ తో ఇప్పటికే హల్ చల్ చేసిన ఈ సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించాడు నాని. ఫిబ్రవరి 16న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు. ఈ రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ ను కూడా డిఫరెంట్ గా చేశాడు.

పైన మీరు చూస్తున్న ఫొటో అదే. రిలీజ్ డేట్ కోసం నాని రిలీజ్ చేసిన స్టిల్ ఇది. నిజానికి “అ!” సినిమాను ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేద్దామనుకున్నాడు నాని. కానీ ఇప్పుడా సినిమాను పోస్ట్ పోన్ చేసి ఫిబ్రవరి 16న తీసుకొస్తున్నారు.

కొత్త కుర్రాడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “అ!” సినిమాలో కాజల్, రెజీనా, నిత్యామీనన్, ఈషా హీరోయిన్లుగా నటించారు. అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.