Ante Sundaraniki టీజర్ రివ్యూ

Wednesday,April 20,2022 - 12:35 by Z_CLU

Nani’s ‘Antey Sundaraniki’ Teaser Review

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అంటే సుందరానికీ’ నుండి టీజర్ రిలీజైంది. రెండు నిమిషాల నిడివితో కట్ చేసిన టీజర్ తో సినిమాలో ఎంత ఫన్ ఉండబోతుందో నాని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతున్నాడో క్లియర్ కట్ చూపించేశారు. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందరం తన కుటుంబంతో పడే ఇబ్బందులు వాటి నుండి వచ్చే ఫన్ హిలేరియస్ గా వర్కౌట్ అవ్వనుందని అర్థమవుతుంది. అలాగే ఒక బ్రాహ్మాణ అబ్బాయికి , క్రిష్టియన్ అమ్మాయికి మధ్య లవ్ ట్రాక్ తో సినిమాలో మంచి ఎంటర్టైన్ మెంట్ క్రియేట్ చేసి వివేక్ ఆత్రేయ ఫన్నీ గా ప్రెజెంట్ చేసినట్టు అనిపిస్తుంది.

టీజర్లో సుందరం అతని ఫ్యామిలీ గురించి అలాగే లీలా అండ్ ఫ్యామిలీ గురించి చెప్తూ సుందరం , లీల మధ్య లవ్ తో  వచ్చే సమస్య చెప్తూ ఫన్ ఎలిమెంట్స్ తో టీజర్ ని ఎంటర్టైన్మెంట్ గా కట్ చేశారు. అలాగే థిస్ ఈజ్ ద స్టోరీ అంటూ చెప్తూనే మళ్ళీ థిస్ ఈజ్ జస్ట్ నాట్ స్టోరీ అంటూ ఇంకా ఉందా ? అని హర్ష వర్ధన్ పాత్ర అడగ్గానే సుందరం అవును అని చెప్తూ లాస్ట్ అందరు అంటే అంటే అనే రియాక్షన్ ఇస్తూ టీజర్ ని ఎండ్ చేశారు.

సో సినిమాలో జస్ట్ ఫన్ మాత్రమే కాకుండా ఇంకా ఏదో ఉందని టీజర్ తో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. టీజర్ లో నాని టైమింగ్ తో డైలాగ్స్, ఫన్ ,  వివేక్ సాగర్ మ్యూజిక్ , నికేత్ బొమ్మి విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా టీజర్ చూస్తే నాని -వివేక్ ఆత్రేయ కలిసి సమ్మర్ ఎండింగ్ లో ఆడియన్స్ ని హిలేరియస్ గా నవ్వించడానికి రెడీ అవుతున్నారని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.  జూన్ 10న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్నారు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics