నాని నిర్మాతగా రెండో సినిమా

Thursday,October 24,2019 - 12:11 by Z_CLU

హీరోగా బిజీగా ఉన్న నాని, నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ పెట్టిన నేచురల్ స్టార్ తొలి ప్రయత్నంగా “అ!” అనే సినిమా నిర్మించాడు. ఇప్పుడు నిర్మాతగా తన రెండో సినిమాను స్టార్ట్ చేశాడు. విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మాతగా సినిమా లాంఛ్ అయింది.

ఈ మూవీకి హిట్ అనే టైటిల్ పెట్టారు. ది ఫస్ట్ కేస్ అనేది ట్యాగ్ లైన్. ఓపెనింగ్ రోజునే ఫస్ట్ లుక్ కూడా లాంఛ్ చేశారు. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదొక మర్డర్ మిస్టరీ అనే విషయం అర్థమౌతోంది.

“అ!” సినిమాతో ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేసిన నాని, హిట్ సినిమాతో శైలేజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. చిలసౌ ఫేమ్ రుహానీ శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు.