మొదటి సినిమా.. 25వ సినిమా.. సేమ్ డైరక్టర్

Monday,February 25,2019 - 05:04 by Z_CLU

నాని మొదటి సినిమా.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ
నాని 25వ సినిమా.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ

ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడికి నాని ఇచ్చిన గౌరవం. అవును.. మొదటి మూవీ చేసిన ఇంద్రగంటి దర్శకత్వంలోనే 25వ సినిమా కూడా చేయబోతున్నాడు నాని. అలా అని ఇది పూర్తిగా నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా కూడా కాదు. ఈ సినిమాలో నానిది చిన్న పాత్ర. ఇంకా చెప్పాలంటే నాని ఇందులో హీరో కూడా కాదు.

దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాబోతున్న మల్టీస్టారర్ మూవీలో సుధీర్ బాబును హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నాని కూడా నటించబోతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఇలా తన సిల్వర్ జూబ్లీ మూవీ విశేషాల్ని బయటపెట్టాడు నేచురల్ స్టార్.

ప్రస్తుతం ఈ హీరో తన 24వ సినిమాను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. దీనికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత నాని 25వ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. తన సిల్వర్ జూబ్లీ సినిమాలో నటించడమే కాకుండా.. దిల్ రాజుతో కలిసి దాన్ని నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నాడట నాని.