అదే స్పీడ్ తో బ్యాక్ టు బ్యాక్...

Sunday,May 14,2017 - 01:00 by Z_CLU

జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నాడు నేచురల్ స్టార్ నాని . ప్రెజెంట్ ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను సెట్స్ పై పెట్టేస్తూ ఆడియన్స్ ను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నేచురల్ స్టార్ గా ఎంటర్టైన్ చేయాలనీ ఫిక్స్ అయిపోయాడు నాని..

ప్రస్తుతం నాని ‘నిన్ను కోరి’ సినిమాతో పాటు ఇటీవలే వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో MCA సినిమా ను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి సెట్స్ పై పెట్టేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు ‘నిన్ను కోరి’ సినిమాలో నటిస్తూనే మరో వైపు ‘MCA’ సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతున్న నాని ‘నిన్ను కోరి’ సినిమాకు త్వరలోనే పాక్ అప్ చెప్పేసి హను రాఘవపూడి దర్శకత్వం లో మరో సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు. వీటితో పాటు మరికొన్ని కథలు కూడా వింటున్న ఈ యంగ్ హీరో ఆ సినిమాలను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకొచ్చి కొన్ని నెలల గ్యాప్ లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్స్ లో హంగామా చేయాలనీ చూస్తున్నాడు..