వెంకీతో సినిమా చేయాలనుంది

Tuesday,April 16,2019 - 10:58 by Z_CLU

వెంకటేష్ ఫంక్షన్ కు వెళ్లాలనే కోరిక ఉండేది. అది బాబు బంగారంతో తీరిపోయింది. నా ఫంక్షన్ కు ఆయనొస్తే బాగుండేదనే కోరిక ఉండేది. అది జెర్సీతో తీరిపోయింది. ఇద్దరం కలిసి ఒక సినిమా చేసి, ఒకే స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది కోరిక. ఆ కోరిక కూడా తీరిపోతే బాగుంటుంది. ఇప్పటికీ మల్టీస్టారర్ టాపిక్ వస్తే వెంకీతో సినిమా చేయమని నాకు చాలామంది చెబుతుంటారు.

ఇలా తన మనసులో మాట బయటపెట్టాడు నేచురల్ స్టార్. ఇప్పటికే నాగార్జునతో కలిసి నటించిన నాని, కుదిరితే వెంకీతో కూడా ఓ సినిమా చేయాలనుకుందే కోరికను బయటపెట్టాడు. జెర్సీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో నాని చెప్పిన మాటలివి.

తన సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన వెంకటేష్ కు థ్యాంక్స్ చెప్పిన నాని, తన రియల్ లైఫ్ హీరోగా వెంకటేష్ ను చెప్పుకొచ్చాడు. ఒక వ్యక్తి తెరపై ఎలా ఉంటాడో, బయట కూడా అలానే ఉంటే అది కేవలం వెంకీ మాత్రమే అన్నాడు నాని.