నాని-విక్రమ్ కుమార్ మూవీ లాంఛ్

Monday,February 18,2019 - 01:18 by Z_CLU

నేచురల్ స్టార్ నాని మరో సినిమా లాంఛ్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. డిసెంబర్ లో ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఈరోజు ప్రారంభించారు.

రొమాంటిక్ ఎఁటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఒక హీరోయిన్ గా ప్రియాంక అనే కొత్తమ్మాయిని సెలక్ట్ చేశారు. ఈరోజు లాంఛింగ్ కు ఆమె వచ్చింది. మిగతా ఇద్దరు హీరోయిన్లను త్వరలోనే ప్రకటిస్తారు. ఆర్ఎక్స్100 సినిమాతో పేరుతెచ్చుకున్న కార్తికేయ, ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమాలో టీనేజ్ కుర్రాడిగా, మిడిల్-ఏజ్డ్ మేన్ గా, వృద్ధుడిగా.. ఇలా 3 గెటప్స్ లో నాని కనిపిస్తాడట. పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. రేపట్నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.