లవ్ స్టోరీస్ తో రెడీ....

Sunday,June 25,2017 - 01:01 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరోలు నాని, వరుణ్ తేజ్ జులై నెలలో తమ లవ్ స్టోరీస్ తో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీ లో ఉన్న  నాని ‘నిన్ను కోరి’, వరుణ్ తేజ్ ‘ఫిదా’ సినిమాలు జులై లో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

లేటెస్ట్ గా టీజర్, ట్రైలర్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తూ సాఫ్ట్ టైటిల్స్ తో  ఎట్రాక్ట్  చేస్తున్న నాని, వరుణ్ తేజ్  క్యూట్ లవ్ స్టోరీస్ తో మాన్సూన్ సీజన్ లో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నారు.


ఇప్పటికే నాని నటించిన ‘నిన్ను కోరి’ జులై 7 న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకోగా లేటెస్ట్ గా వరుణ్ తేజ్ కూడా ఆడియన్స్ ను ‘ఫిదా’ చేయడానికి జులై 21 ని లాక్ చేసుకున్నాడు. సో రెండు డిఫరెంట్  లవ్ స్టోరీస్ తో జులై నెలలోసందడి చేయబోతున్న ఈ హీరోలిద్దరూ బాక్సాఫీస్ దగ్గర  ఎలాంటి  హిట్స్ అందుకుంటారో చూడాలి.