నాని అప్ కమింగ్ మూవీస్

Saturday,July 29,2017 - 10:15 by Z_CLU

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమా చేస్తూ నెలల గ్యాప్ లోనే థియేటర్స్ లో సందడి చేస్తున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో MCA సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను 50% పూర్తి చేసిన నాని మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు.


ప్రెజెంట్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ దిల్ రాజు నిర్మిస్తున్న MCA సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయి గా ఎంటర్టైన్ చేయబోతున్నాడు నాని. ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా భూమిక ఓ కీ రోల్ లో నటిస్తుందని సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 21 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


MCA సినిమా సెట్స్ పై ఉండగానే మేర్లపాక గాంధీ తో చేయబోయే ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా కూడా సెట్స్ పై పెట్టడానికి డిసైడ్ అయ్యాడు నాని. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను ఆగస్టు నుంచి సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు నేచురల్ స్టార్.


కృష్ణార్జున యుద్ధం సినిమా ఓ కొలిక్కి రాగానే హను రాఘవపూడి డైరెక్షన్ లో చేయ బోయే సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు నాని. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మిలటరీ సైనికుడు గా కనిపించనున్నాడు నాని. సో మేర్లపాక సినిమాతో పాటే హను సినిమాను కూడా సెట్స్ పై పెట్టి ఒకే టైంలో రెండు సినిమాలు ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట నాని. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఓ సినిమాను, మరో యంగ్ డైరెక్టర్ తో మరో సినిమాను చేస్తాడనే టాక్ వినిపిస్తుంది.