నాని ఛాన్స్ ఇస్తాడట.. కానీ !

Friday,July 07,2017 - 06:52 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో నాని ప్రెజెంట్ ‘నిన్ను కోరి’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. హీరోగా నెలల గాప్ లోనే సినిమాలు రిలీజ్ చేస్తూ జెట్ స్పీడ్ తో పరిగెడుతున్న నేచురల్ స్టార్ త్వరలోనే ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడట. ఇటీవలే ‘నిన్ను కోరి’ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో నిర్మాతగా సినిమా ఏమైనా నిర్మించే ఆలోచన ఏమైనా ఉందా..అనే ప్రశ్న కి ఎస్ ఆ ఆలోచన ఉంది అంటూ ఆన్సర్ ఇచ్చాడు నాని..

అయితే నిర్మాతగా సినిమా చేస్తానుగాని అందులో నేను నటించే ఛాన్స్ తక్కువే అని చెప్పిన నాని తను నిర్మించే సినిమా నిర్మాతగా చాలా స్పెషల్ గా ఉండాలి. ఏ కాన్సెప్ట్ కైతే నిర్మాతలు దొరకరో అలాంటి స్టోరీ కె నిర్మాతగా ఓటేస్తానని చెప్పుకొచ్చాడు. సో ఈ లెక్కన నాని త్వరలోనే ప్రొడ్యూసర్ గా మారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడన్నమాట.