మరో ప్రాజెక్ట్ ఫైనల్ చేసిన Natural Star

Wednesday,August 12,2020 - 02:15 by Z_CLU

 

ఎప్పటికప్పుడు కొత్త కథలు వినడం, వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకోవడం నాని శైలి. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ప్రస్తుతం Tuck Jagadish సినిమా చేస్తున్న నాని నెక్స్ట్ Shyam Singa Roy సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మరో ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేశాడు Natural Star. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు.

వివేక్ ఆత్రేయ లేటెస్ట్ గా ‘బ్రోచెవారెవరురా’ తో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ నానికి కథ చెప్పడం వెంటనే గ్రీన్ సిగ్నల్ అందుకోవడం జరిగింది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాను ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు నాని. ఈ కాంబినేషన్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. హీరోయిన్ తో పాటు టెక్నికల్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

అన్నట్టు ఈ సినిమాలో Keerthy Suresh ను హీరోయిన్ గా ట్రై చేస్తున్నారట. కానీ ఆమె రిజెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.