నాని కంట్లో పడిన నాగేశ్వరరావు

Thursday,June 14,2018 - 12:18 by Z_CLU

టైగర్ నాగేశ్వరరావు.. కొన్ని రోజులుగా టాలీవుడ్ లో నలుగుతున్న బయోపిక్. స్టువర్టుపురం ఏరియాలో ఇతడు పేరుమోసిన గజదొంగ. దొంగతనాల్లో ఆరితేరిన వ్యక్తి. అతడి జీవితాన్ని సినిమాగా తీయాలని ఫిక్స్ అయ్యాడు దర్శకుడు వంశీకృష్ణ.

దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి సినిమాలు తీసిన వంశీకృష్ణ.. ఈ బయోపిక్ స్టోరీని రాసుకున్నాడు. నిర్మాత అనిల్ సుంకర సహాయంతో రానాకు వినిపించాడు. సినిమా ఆల్ మోస్ట్ సెట్ అయిపోయిందనుకున్న టైమ్ లో ఈ ప్రాజెక్టు నుంచి రానా తప్పుకున్నాడు.

టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ స్థానంలో కోడి రామ్మూర్తి బయోపిక్ ను చేయాలని ఫిక్స్ అయ్యాడు రానా. దీంతో టైగర్ నాగేశ్వరరరావు ప్రాజెక్టు ఇప్పుడు నాని వద్దకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు నాని. త్వరలోనే ఈ డిఫరెంట్ బయోపిక్ పై ఓ క్లారిటీ రానుంది.