'ABCD' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా నాని

Saturday,May 11,2019 - 12:01 by Z_CLU

గ్రాండ్ గా జరగనుంది అల్లు శిరీష్ ABCD ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ నెల 13 హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జరగబోయే ఈ కార్యక్రమానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ బిగిన్ చేసేశారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా రానున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయి ఉంది. దానికి తోడు ఈ ఈవెంట్ కి నాని కూడా అటెండ్ అవుతున్నాడనగానే న్యాచురల్ గానే సోషల్ మీడియాలో మరింత ఫోకస్ లోకి వచ్చింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్.

రుక్సార్ థిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సంజీవ్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. జుధా సాంధీ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.