'V' సినిమా తర్వాతే అంటున్న నాని !

Sunday,September 08,2019 - 02:52 by Z_CLU

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో వచ్చే వారం థియేటర్స్ లోకి రాబోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘V’సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 15 నుండి థాయిలాండ్ లో రెండో షెడ్యుల్ మొదలవుతుంది. అయితే గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ భాగంగా మీడియా ముందుకొచ్చిన నాని ‘V’ సినిమా తర్వాత చేయబోయే సినిమాపై స్పందించాడు.

ఇంద్రగంటి తర్వాత నాని హను రాఘవపూడితో సినిమా చేస్తాడనే టాక్ ఉంది. గతంలో నాని స్వయంగా ఇద్దరం కలిసి ఓ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేసాడు కూడా. అయితే ఈ సినిమా గురించి ఇంటర్వ్యూలో స్పందించాడు నాని. నెక్స్ట్ మూడు సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయని అయితే అందులో నెక్స్ట్ ఏది అనేది మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదని, ‘V’ సినిమా తరువాతే వాటి గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు. హనుతో ప్రస్తుతం డిస్కర్షన్స్ జరుగుతున్నాయని అయితే ఇప్పుడే ఆ సినిమా గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని ఇంకా టైం ఉందని అన్నాడు.

సో నాని మూడు సినిమాల్లో ఏది ముందు స్టార్ట్ చేస్తాడో తెలియాలంటే ‘V’రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా రిజల్ట్ ని బట్టే నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసుకుంటాడట నేచురల్ స్టార్.