ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన నాని

Saturday,February 29,2020 - 12:35 by Z_CLU

నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాతగా, వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై విశ్వ‌క్ సేన్ హీరోగా చేసిన సినిమా `హిట్‌`… `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాలో రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. నిన్న రిలీజైన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటున్నాడు నాని. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాడు.

“హిట్ సినిమా మాది.. హిట్ అయితే మీది అని మెసేజ్ పోస్ట్ చేశాను. ఇప్పుడు సినిమా హిట్ కావ‌డంతో సినిమా మీది(ప్రేక్ష‌కులు)గా మీరు తీసుకున్నారు. టీమ్ అంద‌రం హ్యాపీగా ఉన్నాం. డెబ్యూ డైరెక్ట‌ర్ అయినా శైలేష్ బాగా చేశాడ‌ని అంద‌రూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే అంద‌రూ విశ్వ‌క్ పెర్ఫామెన్స్ గురించి అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా గ‌ర్వంగా ఉంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు.”

“కొత్త కంటెంట్‌ను పెద్ద‌గా ఎంక‌రేజ్ చేయ‌ర‌ని చాలా మంది భ‌య‌పెట్టారు. కానీ నేను ప్రేక్ష‌కుల‌ను న‌మ్మి సినిమా చేశాను. ఆ న‌మ్మ‌కం ఈరోజు నిజ‌మైంది. రివ్యూలు బాగా వ‌చ్చాయి. ఈ సినిమాలో వ‌చ్చిన చిన్న పాటి త‌ప్పుల‌ను కూడా నెక్ట్స్ సినిమాలో లేకుండా చూసుకుంటాం. హిట్ కేస్ 2 ని నేనే నిర్మిస్తున్నాను. ఆల్రెడీ మంచి క‌థ‌ను శైలేష్ సిద్ధం చేశాడు. ప్ర‌తి పాత్ర నాకు బాగా న‌చ్చింది. అన్నీ చ‌క్క‌గా కుదిరాయి.”