ముందు రక్షకుడు.. తర్వాత రాక్షసుడు

Tuesday,January 21,2020 - 12:17 by Z_CLU

నాని, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ V ప్రచారానికి డేట్ ఫిక్స్ అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను పక్కా ప్లానింగ్ తో ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా సుధీర్ బాబు లుక్ ను, తర్వాత నాని లుక్ ను విడుదల చేయబోతున్నారు.

సుధీర్ బాబు కొద్దిసేపటి కిందట ట్వీట్ చేశాడు. రాక్షసుడు ఎదిగినప్పుడు రక్షకుడు వస్తాడని.. సినిమా నుంచి నా ఫస్ట్ లుక్ 27న వస్తుందని ప్రకటించాడు. అంటే.. సినిమాలో సుధీర్ బాబుది హీరో క్యారెక్టర్ అనే విషయం అర్థమౌతోంది.

సుధీర్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ నాని కూడా రియాక్ట్ అయ్యాడు. రక్షకుడు వస్తే, రాక్షసుడు కూడా వస్తాడనే అర్థంతో ట్వీట్ చేశాడు. రాక్షసుడి లుక్ లో ఉండే తన ఫస్ట్ లుక్ ను 28న రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. అంటే.. ఈ సినిమాలో నానిది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అనే విషయం అర్థమౌతోంది.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నివేత థామస్, అదితి రావు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయబోతున్నారు.