జెర్సీ ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది

Tuesday,April 23,2019 - 12:52 by Z_CLU

కొన్నేళ్లు గడిస్తే సినిమాలు పాతపడిపోతాయి. అప్పటి తరానికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. అయితే జెర్సీ మాత్రం అలాంటి సినిమా కాదంటున్నాడు నాని. రాబోయే జనరేషన్స్ కు కూడా జెర్సీ కనెక్ట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.

సినిమా రిలీజ్ కు ముందు ఎప్పుడూ నా మైండ్ లో ఒకటి రన్ అవుతుంటుంది. నా సినిమా ఐదేళ్ల తర్వాత పాతబడిపోతుందేమో అనిపిస్తుంది. అప్పటి జనరేషన్ కు ఇది పాతగా అనిపిస్తుందేమో అనే ఆలోచన నా ప్రతి సినిమాకు ఉంటుంది. కానీ జెర్సీ అలాంటిది కాదు. మేం పాతబడిపోవచ్చు. కెమెరాలు పాతవి అయిపోవచ్చు. హాల్ పాతబడిపోవచ్చు. కానీ జెర్సీ మాత్రం ఎప్పటికీ పాతది అవ్వదు.

ఇలా జెర్సీని ఓ ఎవర్ గ్రీన్ మూవీగా చెప్పుకొచ్చాడు నాని. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం తనకు బాగా ఉందని, మొదటి రోజు దిల్ రాజు ఫోన్ చేసిన తర్వాత సినిమా సూపర్ హిట్ అనే విషయాన్ని నమ్మానని అన్నాడు నాని.

రిలీజ్ రోజు పొద్దున్నే దిల్ రాజు నుంచి ఫోన్ వస్తే మన సినిమా హిట్ అయినట్టే. జెర్సీకి నాకు కాల్ వచ్చింది. మార్నింగ్ షోకు బయల్దేరుతుంటే రాజుగారు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ రావడంతోనే సినిమా హిట్ అనే విషయంపై నాకు క్లారిటీ వచ్చేసింది

జెర్సీ హిట్ అయినందుకు ప్రేక్షకులతో పాటు యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు నాని. తన సినిమాను మెచ్చుకుంటున్న ఇండస్ట్రీ పెద్దలకు, సెలబ్రిటీలకు కూడా థ్యాంక్స్ చెప్పాడు.