MCA పై నాని స్పెషల్ ఫోకస్...రీజన్ అదే.

Sunday,July 16,2017 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ నెలల గ్యాప్ లోనే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న నేచురల్ స్టార్ నాని ప్రెజెంట్ తన లేటెస్ట్ సినిమా ‘MCA’ పై చాలా కేర్ తీసుకుంటూ పూర్తి ఫోకస్ పెడుతున్నాడు. దీనికి రీజన్ నాని కి ఇది 20వ సినిమా కావడమే.. ఓ రకంగా నానికి ఇది ప్రెస్టీజియస్ మూవీ. అందుకే హీరోగా 19 సినిమాలతో ఎంటర్టైన్ చేసిన నాని ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ కొత్త ఎలిమెంట్స్ తో ఎంటర్టైన్ చేయాలనీ చూస్తున్నాడట.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ప్రతీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట నాని. యూనిట్ కూడా ఈ సినిమాను చాలా స్పెషల్ గా భావిస్తోందట. ఇప్పటికే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ను సెలెక్ట్ చేసిన యూనిట్ ప్రెజెంట్ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సాయి పల్లవి ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. సినిమాలో మరో కీ రోల్ లో భూమిక కూడా కనిపించనుందని, నాని – భూమిక మధ్య వచ్చే సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని సమాచారం. సో తన ప్రెస్టీజియస్ మూవీ MCA లో ఇలా చాలా ఎలిమెంట్స్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడట నాని. మరి ఈ ప్రెస్టీజియస్ సినిమాతో నాని ఎలాంటి హిట్ సాదిస్తాడో..