Shyam Singha Roy - సెట్స్ పైకి నాని
Monday,December 21,2020 - 05:09 by Z_CLU
తన కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చాడు నాని (Nani). ఇవాళ్టి నుంచి శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) షూటింగ్ స్టార్ట్ చేశాడు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. ఓ ఫొటో కూడా షేర్ చేసింది.
ఓ టేబుల్‌పై శ్యామ్ సింగ రాయ్ స్క్రిప్ట్ బుక్, దాని పక్కనే ఓ టీ కప్పు ఉన్నాయి. ఆ టేబుల్ అవతల చైర్‌లో నాని కూర్చొని ఉన్నాడు. ఈ వర్కింగ్ స్టిల్ తో మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిందనే విషయాన్ని ప్రకటించారు.

ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా హీరో నాని, హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) మధ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో రాయ్ పాత్రలో నటిస్తున్నాడు నాని. త్వరలోనే శ్యామ్, సింగ్ పాత్రల్లోకి షిఫ్ట్ అవుతాడు.
ఈ మూవీ కోసం చాన్నాళ్ల తర్వాత మేకోవర్ అవుతున్నాడు నాని. కృతి షెట్టితో పాటు సాయిపల్లవి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇకపై పూర్తిగా ఈ సినిమాపైనే ఫోకస్ పెట్టబోతున్నాడు నాని.