నాని కి నెక్స్ట్ వెర్షన్

Tuesday,May 30,2017 - 07:30 by Z_CLU

టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా తన కొడుకు అర్జున్ తో కలిసి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాడు.. ప్రెజెంట్ ‘నిన్ను కోరీ’ ‘MCA’ సినిమాల షూటింగ్స్ తో బిజీ షెడ్యూల్ గడుపుతున్న నాని తాజాగా తన కొడుకుతో ఉన్న ఓ ఫోటో ను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

ఎప్పుడూ తన సరదా మాటలతో సోషల్ మీడియాలో కూడా అలాంటి సరదా పోస్ట్ లు పెడుతూ ఎట్రాక్ట్ చేసే నాని లేటెస్ట్ గా తన కొడుకు పేరు అర్జున్ అని చెప్తూ అర్జున్ అందరికీ హాయ్ చెప్పు అని, అర్జున్ నాని కి నెక్స్ట్ వెర్షన్ అంటూ NANI2POINT0 అని సరదాగా పోస్ట్ చేశాడు. ప్రెజెంట్ తన కొడుకు అర్జున్ ను నాని తన గుండెల మీద పడుకోబెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో హంగామా చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది..