నాని ఇక సినిమాలు చేయడా..?

Tuesday,February 12,2019 - 05:31 by Z_CLU

రీసెంట్ గా అ! సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు నాని. ఎవరూ కనీసం ఎక్స్ పెక్ట్ చేయని కాంబినేషన్. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా కసాంద్ర, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల లీడ్ రోల్స్. అందరూ ఆల్మోస్ట్ బిజీగా ఉన్నవాళ్ళే. ఇక  ఈ సినిమాలో హీరో ఎవరా అంటే కథే. అది నచ్చే సినిమాని నిర్మిద్దామని డిసైడ్ అయ్యాను అని చెప్పుకున్నాడు నాని. మరి ఈ సినిమా తరవాత నానికి ఇంకే కథ నచ్చలేదా…?

‘అ!’ తరవాత నాని బ్యానర్ లో సినిమా గురించి అప్డేట్ కాదు కదా, ఇప్పటి వరకు కనీసం గాసిప్ కూడా బయటికి రాలేదు. కనీసం కథలు వింటున్నట్టు గాని, హోల్డ్ లో పెట్టినట్టు కానీ, ఏ రకమైన అప్డేట్ లేదు. దాంతో ఈ న్యాచురల్ ప్రొడ్యూసర్ ఇప్పట్లో సినిమా నిర్మించొద్దనే డెసిషన్ ఏమైనా తీసుకున్నాడా..? అనే డిస్కర్షన్స్ బిగిన్ అయ్యాయి సోషల్ మీడియాలో.

ఈ నెల 16 తో ఖచ్చితంగా ‘అ!’ రిలీజై ఏడాదవుతుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏ స్థాయి నంబర్ రికార్డ్  చేసింది అనేదానికన్నా, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ తో థియేటర్ నుండి బయటికి వచ్చారన్నదే వాస్తవం. క్రిటిక్స్ కూడా నాని చేసిన ఈ ప్రయోగానికి అభినందించారు. అందుకేనేమో రోజులు గడుస్తున్న కొద్దీ నాని ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై ఏ సినిమా వస్తుందా అనే ఆసక్తి క్రియేట్ అవుతుంది.

సంవత్సరం గడుస్తున్నా ఇంకా నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదంటే నాని ‘అ!’ ని మించిన అద్భుతాన్నేదో నిర్మించాలనే ఆలోచనలో అయినా ఉండాలి, లేకపోతే ‘జెర్సీ’ తో బిజీగా ఉన్నాడు కాబట్టి, నిర్ణయం తీసుకునే సమయమైనా దొరక్కపోయి ఉండాలి. ఇవి రెండూ కాక అందరూ అనుకుంటున్నట్టు ప్రొడక్షన్ పనులు కొన్ని రోజులు పక్కన పెట్టి, ఫుల్ ఫోకస్ యాక్టింగ్ పై పెట్టాలనే డెసిషన్ కైనా వచ్చి ఉండాలి.