‘అ!’ మూవీలో నాని రోల్ రివీలయింది

Saturday,December 23,2017 - 05:02 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న నాని రీసెంట్ గా  ‘అ!’ మూవీని అనౌన్స్ చేశాడు. ఆ తరవాత ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న స్టార్స్ ఫస్ట్ లుక్స్ ని రివీల్ చేసిన అ! టీమ్, ఈ రోజు నాని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. అయితే నాని ఈ సినిమాలో ‘చేప’లా కనిపించనున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి కథతో సినిమా తెరకెక్కలేదు, డెఫ్ఫినేట్ గా డిఫెరెంట్ సినిమా అని నాని బిగినింగ్ లోనే చెప్పినట్టు, ఈ మూవీ రిలీజ్ చేస్తున్న ఫస్ట్ లుక్స్ ని బట్టి ఫ్యాన్స్ లోనే కాదు, సినీ వర్గాల్లో కూడా క్యూరాసిటీ రేజ్ అవుతుంది.

 

నాని కరియర్ బిగినింగ్ లో ‘ఈగ’ సినిమాలో ఈగలా కనిపించిన తరవాత స్పీడందుకున్న నాని కరియర్ నానిని న్యాచురల్ స్టార్ గా నిలబెట్టింది. ఇప్పుడీ సినిమాలో ‘చేప’ లా కనిపించనున్న నాని, ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అవ్వడం గ్యారంటీ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.