‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అదే

Monday,March 26,2018 - 04:48 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు నాని. రీసెంట్ బ్లాక్ బస్టర్ MCA తరవాత రిలీజవుతున్న ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాపై ఫ్యాన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. నాని డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో 2 డిఫెరెంట్ రోల్స్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. అయితే సినిమాలో ఈ 2 క్యారెక్టర్స్ కి మధ్య ఉండబోయే కనెక్టివిటీని రివీల్ చేశాడు నాని.

‘కృష్ణార్జున యుద్ధం కాంటెంపరరీ మూవీ. కృష్ణ, అర్జున్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక సమస్యపై చేసే పోరాటమే ఈ సినిమా. ఇందులో కృష్ణ క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. కంప్లీట్ గా చిత్తూరు యాసలో మాట్లాడే క్యారెక్టర్. ఇక అర్జున్ రాక్ స్టార్. రెండు డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్స్ నుండి వచ్చిన యంగ్ స్టర్స్ ఒక సమస్యపై ఎలా పోరాడారు అన్నదే ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది.’ అని కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు నాని. ఈ రోజే ఈ సినిమా జ్యూక్ బాక్స్  ని రిలీజ్  చేసింది  సినిమా యూనిట్.

 

మార్చి 31 న తిరుపతి మున్సిపల్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోనున్న సినిమా యూనిట్, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు రివీల్ చేయనుంది. ఏప్రియల్ 12 న రిలీజవుతున్న ఈ సినిమాకి మేర్లపాక గాంధీ డైరెక్టర్.