గూఢచారి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి: నాని

Saturday,July 28,2018 - 12:36 by Z_CLU

‘క్షణం’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి’. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా గూఢచారి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్ ను ఈమధ్య సమంత రిలీజ్ చేసారు. ఇప్పుడు ట్రయిలర్ ను నాని రిలీజ్ చేశాడు.

ఈ కార్యక్రమంలో హీరో అడివి శేషు, హీరోయిన్ శోభిత, దర్శకుడు శశికిరణ్, మతాల రచయిత అబ్బూరి రవి, కెమెరామెన్ శనియేల్ డియో, నిర్మాతలు టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్  అధినేత అనీల్ సుంకర పాల్గొన్నారు.

నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “- లాస్ట్ టైం నేను అర్జున్ రెడ్డి థియేటర్ ట్రైలర్ ని లంచ్ చేశాను. అది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు గూఢచారి ట్రయిలర్ విడుదల చేస్తున్నాను. ఇది శేషుకి కరెక్ట్ సినిమా. రైట్ టైంలో వస్తుంది. నాకు ఈ సినిమా టీజర్, ట్రైలర్ పిచ్చి పిచ్చిగా నచ్చాయి. ట్రైలర్ ఈ రేంజిలో ఉంటే రేపు సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో.” అన్నారు.

జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, రవిప్రకాష్,  ముఖ్యపాత్రల్లో నటించిన గూఢచారి సినిమాకు, అన్ని ఏరియాల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేసారు. ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా ఆగష్టు ౩న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని అయన  రిలీజ్ చేస్తున్నారు.