నానితో నటిస్తే సూపర్ హిట్టే

Wednesday,April 12,2017 - 06:36 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వడమే కాకుండా, హీరోయిన్లకు లైఫ్ ఇస్తూ గోల్డెన్ హ్యాండ్ అనిపించుకుంటున్నాడు నాని. ఈమధ్య కాలంలో నానితో నటించిన ప్రతి హీరోయిన్ క్లిక్ అయింది.

 భలే భలే మగాడివోయ్ లావణ్య

భలే భలే మాగాడివోయ్ సినిమాలో నానితో జోడీ కట్టింది లావణ్య. నిజానికి లావణ్య కరియర్ భలే భలే మగాడివోయ్ కి ముందు వేరు, తరవాత వేరు. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయిన లావణ్య, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయింది.

 

జెంటిల్ మేన్ నివేదా థామస్

జెంటిల్ మెన్ సినిమాలో నానికి ఎంత స్కోప్ ఉంటుందో నివేదా థామస్ కి అంతే స్కోప్ ఉంటుంది. నిజానికి జెంటిల్ మెన్ స్టోరీ మొత్తం నివేదా థామస్ ప్లే చేసిన క్యారెక్టరే నడిపిస్తుంది. ఫస్ట్ సినిమాకే నాని సరసన చాన్స్ కొట్టేసిన  నివేద థామస్, జెంటిల్ మెన్ తరవాత ట్యాలెంటెడ్ హీరోయిన్ ట్యాగ్ ని తన ఇంటి పేరుగా మార్చుకుంది. జెంటిల్ మెన్ తరవాత నాని సరసన ‘నిన్ను కోరి’ సినిమాలోను నటిస్తున్న నివేదా ఇప్పుడు NTR ‘జై లవకుశ’ లోను హీరోయిన్ స్పేస్ ని సొంతం చేసుకుంది.

కృష్ణగాడి వీరప్రేమగాథ మెహరీన్

 కృష్ణ గాడి వీర ప్రేమ గాథ కి ముందు మెహరీన్ కౌర్ ఎవరో కూడా ఎవరికీ తెలీదు. ఆ సినిమా సూపర్ హిట్ అయిందో లేదో, బడా బడా స్టార్స్ దృష్టిలో పడిపోయింది మెహరీన్. ఇప్పుడు సాయి ధరం తేజ్ తో జవాన్ లోను, రవితేజ సరసన ‘రాజా ది గ్రేట్’ లోను హీరోయిన్ చాన్స్ కొట్టేసింది ఈ పంజాబీ పిల్ల. వీటితో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది.

మజ్ను అను ఎమ్మాన్యుయేల్

మజ్ను సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన అనూ ఇమ్మాన్యువెల్ ఒక్క సినిమాతోనే బ్రాండెడ్  హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత ఏకంగా పవర్ స్టార్ సినిమాకి క్వాలిఫై అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో తలముకలవుతున్న అను, కేర్ ఫుల్ గా కరియర్ ని ప్లాన్ చేసుకుంటుంది.

 

నేను లోకల్ కీర్తి సురేష్

నేను శైలజ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన కీర్తి సురేష్, ఈ సినిమాతో ఏకంగా నాని ఫ్యాన్స్ ని కూడా తన అకౌంట్ లో వేసేసుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో ప్రతి ఒక్కరిని ఈజీగా రీచ్ అయిపోయిన కీర్తి, ఇప్పుడు టాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో ట్రెండ్ అవుతున్న హీరోయిన్స్ లిస్టులో పై లిస్టుకి చేరుకుంది. ప్రస్తుతం పవన్ సినిమా ఈమె ఖాతాలో ఉంది.