మళ్ళీ పాత పద్ధతిలోకి నేచురల్ స్టార్

Friday,March 22,2019 - 11:03 by Z_CLU

హిట్స్ ఫ్లాప్స్ అస్సలు పట్టించుకోడు…సినిమాని ఎంత కష్టపడి చేస్తాడో, ఆ సినిమా రిలీజ్ తరవాత వచ్చే రెస్పాన్స్ ని కూడా అంతే పద్దతిగా గమనిస్తాడు. అందుకే తన సెట్ ఆఫ్ ఆడియెన్స్, తన నుండి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో నానికి బాగా తెలుసు. అందుకే మూస పద్ధతికి గుడ్ బాయ్ చెప్పి ధైర్యంగా పాత పద్ధతిని పాటించేస్తున్నాడు నాని.

పక్కా ప్రయోగాలు అని చెప్పలేం కానీ, రొటీన్ కి కూసంత దూరంగా ఉండే ప్రయత్నమైతే 100% చేస్తాడు నాని. అలా చేసిన ప్రతి ప్రయత్నం నానిని ఫ్యాన్స్ కి ఇంకా దగ్గర చేసింది. అలాంటి అవకాశం వచ్చినప్పుడల్లా పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న ‘జెర్సీ’ కూడా అలాంటి సినిమానే.

 మొన్నామధ్య కొంచెం కమర్షియల్ డోస్ పెంచేసి సరదాగా ‘కృష్ణార్జున యుద్ధం’ చేసినా, ఆ సినిమా రిజల్ట్ నాని నుండి ఆడియెన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో చెప్పకనే చెప్పేశారు. దాంతో నాని మరింత అలర్ట్ అయ్యాడు. వీలైనంత వరకు ప్రతీది స్పెషలే అనిపించేలా సినిమాలు చేసుకుంటున్నాడు.

‘ఎవడె సుబ్రహ్మణ్యం’ సినిమా నానికి కావాల్సినంత రెస్పెక్ట్ సంపాదించి పెడితే, ఆ తరవాత ఇమ్మీడియట్ గా రిలీజైన ‘భలే భలే మగాడివోయ్’ నానిలోని కామెడీ టైమింగ్ ని బయటపెట్టింది. ఆ తరవాత వరసగా వచ్చిన క్రిష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మెన్, మజ్ను, నిన్నుకోరి, దేవదాస్ సినిమాలు నానిలోని స్టామినాని ఎప్పటికప్పుడు ఎలివేట్ చేస్తూనే ఉన్నాయి.

 ఇప్పుడు ‘జెర్సీ’ కూడా అంతే. నిజానికి ఈ సినిమాకి జస్ట్ యాక్టర్ అయితే అస్సలు సరిపోదు. కథను బట్టి ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలి. అందుకే ట్రైనింగ్ తీసుకున్నాడు. యూత్ క్రికెటర్ గా, రొమాంటిక్ గా కనిపిస్తూనే  సెకండాఫ్ లో గెలుపు తప్ప ఇంకో లక్ష్యం లేని ఎమోషనల్ వ్యక్తిలా మరింత నేచురల్ గా మెస్మరైజ్ చేయబోతున్నాడు నాని.