Nani - నెక్ట్స్ ఇయర్ టార్గెట్ ఇదే?

Sunday,November 22,2020 - 03:53 by Z_CLU

ఈ ఏడాది ఆరంభంలో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయిన యంగ్ హీరోలు వచ్చే ఏడాది రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందులో ముందు వరుసలో ఉన్నాడు Nani. అవును.. Natural Star నుండి 2021 లో మూడు సినిమాలు రాబోతున్నాయి.

శివనిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ‘Tuck Jagadish’ తో పాటు రాహుల్ సంక్రిత్యన్ తో చేయనున్న ‘Shyam Singha Roy’ అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్న ‘Ante Sundaraniki’ సినిమాలు వచ్చే ఏడాది థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాలు 2021 రిలీజ్ టార్గెట్ గా రెడీ అవుతున్నాయి.

సో.. ఈ ఏడాది తన సినిమాలు మిస్ అయిన ప్రేక్షకులకు ఒకటి రెండు కాకుండా ఏకంగా మూడు సినిమాలు చూపించే పనిలో ఉన్నాడు నాని. మరి ఈ సినిమాలతో వరుసా హట్రిక్ హిట్స్ అందుకొని వచ్చే ఏడాది సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకుంటాడో లేదో చూడాలి.

Also Check – యంగ్ డైరక్టర్స్ మాత్రమే..!