మరో సినిమా ప్లాన్ చేస్తున్న నాని?

Monday,January 01,2018 - 11:02 by Z_CLU

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా అ! అనే సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం అనుకోకుండా నిర్మాతగా మారిన నాని ఇదే కోవలో మరో కాన్సెప్ట్ బెసేడ్ సినిమాను నిర్మించి ప్లాన్ లో ఉన్నాడట.

లేటెస్ట్ గా నిర్మాత దొరకని కొత్త కథ ఉంటే కచ్చితంగా నిర్మిస్తానని అనౌన్స్ చేసిన నాని లేటెస్ట్ గా ఓ యువ దర్శకుడు చెప్పిన అలాంటి కథ ఒకటి విని ఫిదా అయ్యాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం నాని మరో సారి నిర్మాతగా మారబోతున్నాడని సమాచారం. మరి నిర్మాతగా నాని ఎలాంటి హిట్స్ అందుకుంటాడో..చూడాలి.