అదరగొడుతున్న నాని ‘నిన్నుకోరి’ ట్రేలర్

Saturday,June 17,2017 - 10:21 by Z_CLU

నాని ‘నిన్నుకోరి’ ట్రేలర్ రిలీజయింది. నివేద థామస్ హీరోయిన్ గా ఆది పినిశెట్టి కీ రోల్ ప్లే చేస్తున్న ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ఆల్ రెడీ క్రియేట్ అయి ఉన్న ఇంట్రెస్ట్ ని రెండింతలు చేస్తుంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజాగ్ తో పాటు, U.S. లోని అద్భుతమైన లొకేషన్స్ లలో తెరకెక్కించింది సినిమా యూనిట్. ఆ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ట్రేలర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది.

వైజాగ్ లో బిగిన్ అయిన ఓ లవ్ స్టోరీ రీజన్స్ తెలీట్లేదు కాదు కానీ బ్రేకప్ అయిపోయి, U.S. లో పెద్ద టర్న్ తీసుకుంటుంది. అక్కడే అసలు స్టోరీ బిగిన్ అయిపోతుంది. ఆ తరవాత ఏం జరగబోతుంది…? అంది సిల్వర్ స్క్రీన్ పై చూసి తరించాల్సిందే. అల్టిమేట్ మెస్మరైజింగ్ మెస్మరైజింగ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ జూలై 7 న రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇంటరెస్టింగ్ టీజర్, రెండు సూపర్ హిట్ సాంగ్స్, ఇప్పుడీ ట్రేలర్.. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న నాని కరియర్ లో మరో బ్లాక్ బస్టర్ ఆల్ రెడీ స్పేస్ క్రియేట్ చేసుకున్నట్టే అనిపిస్తుంది. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని D.V.V. దానయ్య నిర్మిస్తున్నారు.