విక్రంతో సినిమా ఫిక్స్ చేసుకున్న నాని

Sunday,April 15,2018 - 04:11 by Z_CLU

ప్రస్తుతం నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న నాని ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. నెక్స్ట్ సినిమాను  విక్రం కే కుమార్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు నేచురల్ స్టార్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కే చాన్స్ ఉంది.

మైత్రి బ్యానర్ లో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో నాని ఓ సినిమా చేయాల్సింది కానీ ఆ సినిమా సెట్ కాకపోవడంతో ఇప్పుడు విక్రం కుమార్ సినిమాను ఈ బ్యానర్ లో చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది.

‘ఇష్క్’,’మనం’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన విక్రం కుమార్ నానితో చేయబోయే సినిమాను థ్రిల్లర్ జోనర్ లో చేయబోతున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై అధికార ప్రకటన రానుందని తెలుస్తుంది.