రీమేక్ సినిమాకి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా ?

Sunday,November 18,2018 - 01:02 by Z_CLU

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా ఓ రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే 96… కోలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీగా నిలిచిన ఈ సినిమాను త్వరలోనే తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు దిల్ రాజు.. ఇప్పటికే నాని కి ఓ స్పెషల్ షో వేసి మరీ సినిమాను చూపించారు కూడా. అయితే నానికి సినిమా నచ్చడంతో దిల్ రాజు కి ఓకే చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం డిస్కర్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేసే చాన్స్ ఉంది. మరి నిజంగానే నాని ఈ రీమేక్ సినిమా చేస్తాడా…? లేదా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.