నానితో ఆ డైరెక్టర్ ఫిక్స్ ....?

Sunday,October 28,2018 - 12:15 by Z_CLU

ప్రస్తుతం నాని నెక్స్ట్ సినిమా లిస్టు లో విక్రం కుమార్, హను రాఘవాపూడి, అవసరాల శ్రీనివాస్, చంద్రశేఖర్ ఏలేటి వంటి డైరెక్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే.. వీళ్ళతో పాటు  కొత్త దర్శకుల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. లేటెస్ట్ గా నాని నెక్స్ట్ సినిమా లిస్టు లో మరో డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. అతనే శ్రీకాంత్ అడ్డాల. ఇటివలే ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్ రెడీ చేసిన శ్రీకాంత్ అడ్డాల లేటెస్ట్ గా నాని ని కలిసి స్క్రిప్ట్ వినిపించాడని తెలుస్తుంది.

అన్నీ కుదిరితే ‘జెర్సీ’ తర్వాత నాని చేయబోయే సినిమా ఇదే అని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారని సమాచారం.