ఎక్స్ ప్రెస్ డైరక్టర్ తో నేచురల్ స్టార్

Wednesday,July 05,2017 - 11:51 by Z_CLU

ప్రెజెంట్ వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో సినిమాను కంఫర్మ్ చేశాడు. ప్రెజెంట్ వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో ‘ఎం.సి.ఎ’ సినిమా చేస్తున్న నాని ఈ సినిమాకు సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా కంటే ముందే హను రాఘవపూడి తో ఓ సినిమా చేస్తానని నాని అనౌన్స్ చేయడంతో ఎం.సి.ఎ తర్వాత హను సినిమా చేస్తాడనుకున్నారంతా… కానీ ఈ సినిమా కంటే ముందే మరో సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడు నేచురల్ స్టార్.

 ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’,’ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలతో ఎక్స్ ప్రెస్ డైరక్టర్ అనిపించుకున్న మేర్లపాక గాంధీతో నాని సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని పక్కా చేసిన నాని.. ఆగస్టు నుంచి మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. నిన్ను కోరి సినిమా రిలీజ్ అయిన వారంలో సినిమా డీటెయిల్స్ అనౌన్స్ చేస్తామంటున్నాడు.