కొత్త దర్శకుడితో నాని సినిమా !

Sunday,November 17,2019 - 12:05 by Z_CLU

ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘V’ సినిమాలో సుదీర్ బాబు తో కలిసి నటిస్తున్న నేచురల్ స్టార్ నాని ఎట్టకేలకు నెక్స్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. త్వరలోనే ఇండస్ట్రీ కి ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడు నాని. అవును శ్రీకాంత్ అనే దర్శకుడితోనే నాని తన 26వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇటివలే నాని కి ఓ డిఫరెంట్ లైన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. శ్రీకాంత్ గతంలో సుకుమార్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసాడు. త్వరలోనే అనౌన్స్ మెంట్ రానున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నారని సమాచారం.