ఆ డైరెక్టర్ తో నాని ఫిక్స్ ..?

Sunday,September 09,2018 - 04:06 by Z_CLU

ప్రస్తుతం నాగార్జునతో కలిసి ‘దేవదాస్’ సినిమా చేస్తున్నాడు నాని.. ఈ సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది.. నెక్స్ట్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో ‘జెర్సీ’ అనే స్పోర్ట్ బేస్డ్ మూవీ చేయబోతున్నాడు నేచురల్ స్టార్..అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సినిమా తర్వాత నాని చేయబోయే మరో సినిమా కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. ఇటివలే చంద్ర శేఖర్ ఏలేటి నానికి ఓ కథ వినిపించాడని, నాని కి స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేడసానే టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. సో జెర్సీ తర్వాత నాని చేయబోయే సినిమా ఇదే అయ్యే ఛాన్స్ ఉంది.