ఆరు సినిమాలు రెడీ చేస్తున్న నాని

Sunday,April 15,2018 - 11:10 by Z_CLU

వరుస సూపర్ హిట్స్ తో జోరు పెంచిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఆరు సినిమాలు రెడీ చేస్తున్నాడు.  లేటెస్ట్ గా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో  ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని  నాగార్జున తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఓ ఇంటర్వ్యూ లో నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది..అనే ప్రశ్నకు ఆరు సినిమాలు రెడీ అవుతున్నాయని. ప్రస్తుతం వాటికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని  నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది త్వరలోనే అనౌన్స్ చేస్తానని చెప్పాడు.

ఈ ఆరు సినిమాల్లో మూడు సినిమాలు విక్రం కుమార్ తో అవసరాల శ్రీనివాస్ తో అలాగే హను రాఘవపూడి తో ఉంటాయని తెలిపాడు నేచురల్ స్టార్ నాని. ఇలా ఏడాది ఓ మూడు సినిమాలు ప్లాన్ చేస్తూ దూసుకేల్తున్నాడు ఈ యంగ్ హీరో.