బ్యాక్ టు బ్యాక్...

Saturday,November 19,2016 - 10:30 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరింత స్పీడ్ పెంచాడు. రీసెంట్ గా ‘మజ్ను’ తో హిట్ కొట్టిన నాని.. అదే ఊపులో తన కొత్త సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో నాని నటిస్తున్న ‘నేను లోకల్’ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. దీంతో పాటు ఇప్పుడు మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శివ నిర్వానంద్ అనే యువ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. డి.వి.వి. సినిమా బ్యానర్ పై దానయ్య నిర్మించనున్న ఈ మూవీలో, నాని సరసన నివేద థామస్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో జెంటిల్ మేన్ సినిమా వచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాను నవంబర్ 23న లాంఛ్ చేసి, జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.