#Nani28 - నేచురల్ స్టార్ నుంచి మరో మూవీ
Friday,November 13,2020 - 12:11 by Z_CLU
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే నాని, మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.
బ్రోచేవారెవరురా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు Vivek Atherya. అంతకంటే ముందు మెంటల్ మదిలో అనే రొమాంటిక్ డ్రామాను తెరకెక్కించి క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు. అతడికిది మూడో సినిమా.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఇంతకుముందు గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేశాడు Nani. ఆ బ్యానర్ లో నేచురల్ స్టార్ కిది రెండో సినిమా. ఇక ఈ సినిమాతో నజ్రియా ఫహాద్ (Nazriya Fahadh) అనే అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.
ఈరోజు కేవలం మూవీ ఎనౌన్స్ మెంట్ మాత్రమే. టైటిల్ ను 21వ తేదీన చెబుతారు. వచ్చే ఏడాది నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వస్తుంది.