మరో సినిమా ప్రారంభించిన నేచురల్ స్టార్

Wednesday,November 23,2016 - 02:36 by Z_CLU

మొన్నటికిమొన్న మజ్ను సినిమా రిలీజ్ చేశాడు. మరోవైపు ‘నేను లోకల్’ ఇంకా సెట్స్ పైనే ఉంది. ఇంతలోనే ఇంకో సినిమా లాంచ్ చేశాడు నాని. ఇంకా టైటిల్ డిసైడ్ కాని ఈ సినిమాలో నివేద థామస్ హీరోయిన్ గా చేస్తుంది. ‘సరైనోడు’లో విలన్ గా చేసిన ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

001-102

డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాతో శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫిలింనగర్ లోని దైవసన్నిధానంలో ప్రారంభమైన ఈ సినిమా లాంఛింగ్ కు వినాయక్, కొరటాల శివ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఫస్ట్ షాట్ కు వినాయక్ క్లాప్ కొడితే… కొరటాల కెమెరా స్విచాన్ చేశారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 80శాతం షూటింగ్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ సినిమాకు కోన వెంకట్… స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తుండగా…  గోపీ సుందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.