అమెరికా షెడ్యూల్ పూర్తిచేసిన నాని

Saturday,March 11,2017 - 02:25 by Z_CLU

వరుసపెట్టి సినిమాలు చేయడమే కాకుండా… బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కూడా అందుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే నేను లోకల్ సినిమాతో ఈ ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేసిన నాని, ఇప్పుడు మరో సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సినిమా పేరు నిన్ను కోరి. శివ నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. దాదాపు నెల రోజుల పాటు అమెరికాలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అలా భారీ షెడ్యూల్ పూర్తిచేసిన నాని, ఈమధ్యే తిరిగి హైదరాబాద్ వచ్చాడు.

కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత శివ నిర్వాణ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడు నాని. ఈ మూవీతో పాటు దిల్ రాజు బ్యానర్ లో ఎంసీఎ అనే మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్స్ లో ఉన్నాడు. ఈ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. సో… ఈ ఏడాది నాని నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నాయన్నమాట.