U.S. లో నాని కొత్త సినిమా

Wednesday,January 25,2017 - 04:20 by Z_CLU

నేను లోకల్ సినిమా ఇంకా థియేటర్స్ లోకి కూడా రాలేదు. అప్పుడే నాని తన నెక్స్ట్ సినిమా కోసం లగేజ్ సర్దుకుంటున్నాడు. శివ నిర్వాన డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఈ నెల 30న U.S. కి బయలుదేరుతున్నాడు.

అమెరికన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ కొత్త సినిమాలో నివేద థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆది పినిశెట్టి ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాతో తన కరియర్ లో మరో హ్యాట్రిక్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని.

కోన వెంకట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసిన ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. దానయ్య D.V.V. నిర్మిస్తున్న ఈ సినిమా యూనిట్ U.S. లో నెల రోజుల భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తుంది.