నాని ‘నేను లోకల్’ రిలీజ్ డేట్

Monday,November 28,2016 - 02:40 by Z_CLU

నానికి ఓవర్ సీస్ లో భారీ క్రేజ్ ఉంది. మరీ బాక్సాఫీస్ రికార్డులను ఇరగదీసే సినిమాలు కాకపోయినా, ఓ వీకెండ్ కి మంచి సినిమా చూశాం అన్న స్యాటిస్ ఫ్యాక్షన్ అయితే కంపల్సరీగా ఇస్తాడు నాని. అందుకే.. నాని సినిమాకి అంత క్రేజ్ ఉంది కాబట్టే, కాస్త డిఫెరెంట్ గా ఓవర్ సీస్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ క్రిస్ మస్ హాలీడేస్ ని క్యాష్ చేసుకుందామనుకుంటున్నాడు దిల్ రాజు.

నాని ‘నేను లోకల్’ డిసెంబర్ 22 న రిలీజవుతుంది. ఇంతకుముందు సరిగ్గా క్రిస్ మస్ రోజున రిలీజ్ కి ప్లాన్ చేసుకున్న సినిమా యూనిట్, ఆ తరవాత ఓవర్ సీస్ లో క్రిస్ మస్ హాలీడేస్ ని మైండ్ లో పెట్టుకుని సినిమా రిలీజ్ ని ఇంకో మూడు రోజులు ముందుగా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.