దేవదాస్ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ అదే...

Friday,September 21,2018 - 01:46 by Z_CLU

ఈ నెల 27 న రిలీజవుతుంది దేవదాస్ సినిమా. ఇప్పటికే ఆడియో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేసిన మేకర్స్, సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇస్తూ ట్రైలర్   రిలీజ్  చేశారు. 2:06 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ చూశాక, ఇంతకీ దేవ, దాస్ కి చెప్పిన అబద్ధం ఏమై ఉంటుందా…? అనే క్యూరియాసిటీ జెనెరేట్ అవుతుంది.

సినిమాలో దేవ పక్కా మాస్. అందునా మాఫియా డాన్. ఇక దాస్ విషయానికి వస్తే సెన్సిటివ్ గా రియాక్ట్ అయ్యే డాక్టర్. వీళ్ళిద్దరికీ ఫ్రెండ్ షిప్ ఎలా కుదురుతుంది..? అవతల మాఫియా డాన్ కాబట్టి బెదిరిస్తే కుదురుతుంది. ఆ విషయం ఇప్పటికే అర్థమైపోయింది. అయితే ఈ ఫన్నీ, ఫ్రెండ్ షిప్ స్టోరీలో ఉండబోయే కాంఫ్లిక్ట్ ఏంటి..? ఈ క్వశ్చన్ ని రేజ్ చేస్తుంది ట్రైలర్.

మరీ ముఖ్యంగా 1:16 దగ్గర వెన్నెల కిషోర్ ‘మాఫియాతో పెట్టుకోకూడదు..’ అని చెప్పడం, దానికి నాని  ‘డాక్టర్స్ సర్, మనతో అబద్దం చెప్పకూడదు..’ అని చెప్పడంతో, సినిమాలో జస్ట్ కామెడీనే కాదు, అంతకన్నా స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉందని అర్థమవుతుంది. ఓవరాల్ గా నెక్స్ట్ వీకెండ్ దేవ,దాస్ లా ఫ్రెండ్ షిప్, 100% ఎంటర్ టైన్ చేయడం గ్యారంటీ అనే వైబ్స్ క్రియేట్ చేస్తుందీ ఈ సినిమా ట్రైలర్.

శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్స్ గా నటించారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.