మెట్రోలో మల్టీస్టారర్

Wednesday,March 28,2018 - 12:31 by Z_CLU

రీసెంట్ గా ఉగాది రోజున సెట్స్ పైకి వచ్చిన నాని, నాగార్జునల మల్టీస్టారర్ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్ తో పాటు, మెట్రో ట్రైన్ లో నాని, రష్మిక, సంపూర్ణేష్ బాబు కాంబినేషన్ లో హిలేరియస్ సీన్స్ ని తెరకెక్కించారు. దీంతో మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

రీసెంట్ గా రిలీజైన అఖిల్ ‘హలో’ సినిమా తరవాత మెట్రోలో షూటింగ్ జరుపుకున్న మూవీ ఇదే కావడం విశేషం. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకుడు.

నాని, నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి అశ్వనీదత్ నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.