Jersey కాంబోలో మరో సినిమా?

Tuesday,March 30,2021 - 12:30 by Z_CLU

నేచురల్ స్టార్ నాని తో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘జెర్సీ’ మంచి ప్రశంసలతో తాజాగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ నేపథ్యం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అందుకే మళ్ళీ గౌతంతో సినిమా చేయాలని చూస్తున్నాడట నాని. తాజాగా గౌతం చెప్పిన ఒక స్క్రిప్ట్ ని నేచురల్ స్టార్ లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం నాని ఓ మూడు ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక గౌతం ‘జెర్సీ’ ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇద్దరూ ఫ్రీ అవ్వగానే ఈ సినిమా మొదలు పెడతారని సమాచారం. ఈ లోపు గౌతం స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడు.

మరి ఈ కాంబో సినిమాను ఎవరు నిర్మిస్తారు ? అనేది తెలియాల్సి ఉంది.