వయొలెన్స్ ఇస్తానంటున్న నాని

Monday,November 04,2019 - 11:25 by Z_CLU

వయొలెన్స్ కావాలన్నారుగా.. ఇస్తా.. ఈ ఉగాదికి సాలిడ్ గా ఇస్తా..
ఇలా ఓ స్టేట్ మెంట్ ఇచ్చి మరీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు నాని. అవును.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని చేస్తున్న సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఉగాది కానుకగా వచ్చే ఏడాది మార్చి 25న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. నానికి కెరీర్ లో ఇది 25వ చిత్రం.

నాని చెప్పినట్టు పక్కా యాక్షన్ కంటెంట్ తో వస్తోంది V. నానితో పాటు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరి, నివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

రీసెంట్ గా సైరా నరసింహారెడ్డికి అద్భుతమైన ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అమిత్ త్రివేది, V సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో ఇతడికిది వరుసగా రెండో సినిమా.

గ్యాంగ్ లీడర్ తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా ఇది. గతంలో ఇంద్రగంటి-నాని కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అందుకే V సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్నట్టు ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని చిన్న టాక్.